: విశాఖ ఎయిర్ పోర్ట్ లో చేతిరాతల సమాచారమే దిక్కు!


హుదూద్ తుఫాను బీభత్సం నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల తర్వాత తొలిసారిగా ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయంలో దిగనుంది. ఆ తర్వాత మరో గంటకు టేకాఫ్ తీసుకునే సదరు విమానం నేరుగా హైదరాబాద్ వెళుతుంది. విమాన రాకపోకలు పునరుద్ధరణ అయినా, విమానాశ్రయాన్ని విధ్వంస చిహ్నాలు వీడలేదు. బీభత్సం కలిగించిన గుర్తులు చెరిగిపోవాలంటే సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమాన రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని చేతిరాతతో కూడా బోర్డుల ద్వారా ప్రయాణికులు తెలుసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. విమాన రాకపోకలు, ఇతర సమాచారాన్ని ప్రయాణికులకు అందించేందుకు కంప్యూటర్ స్క్రీన్ల ను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సదరు స్క్రీన్లతో పాటు విమానాశ్రయ పైకప్పు కూడా హుదూద్ కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పైకప్పును టార్పాలిన్ కవర్లతో కప్పిన అధికారులు, రాకపోకల సమాచారం కోసం చేతిరాతతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News