: మహిళా లెక్చరర్లను వేధిస్తున్న కాలేజి డైరెక్టర్


మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మెదక్ జిల్లా సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు కాలేజిలో పనిచేస్తున్న మహిళా లెక్చరర్లపై ఆ కాలేజి డైరెక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అతడి తీరుపై ఆ లెక్చరర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ కిరణ్ కుమార్ ఆగడాలు ఎక్కువయ్యాయని, అందుకే పోలీసులకు తెలిపామని వారు అంటున్నారు. అటు, కిరణ్ కుమార్ వేధింపుల వ్యవహారంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థులు కళాశాల ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News