: రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన జగన్
తుపాను బాధితుల సహాయార్థం వైకాపా అధినేత జగన్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి ఏర్పాటు చేసిన తుపాను సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో హుదూద్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని... ప్రతి ఒక్కరూ తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి తుపాను సహాయ నిధికి శక్తిమేర సాయం అందించాలని కోరారు.