: డిసెంబర్ లో మరో మూడు ప్రయోగాలకు ఇస్రో సన్నద్ధం
వరుస విజయాలతో మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ నెలలో మరో మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. పీఎస్ఎల్వీ మార్క్ 3 ఎక్స్పరిమెంటల్ ప్రయోగంతో పాటు పీఎస్ఎల్వీ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ 1-డీని ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ రెండింటినీ షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తారు. జీశాట్ 16ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు.