: హర్యానాలో రికార్డు స్థాయిలో 76 శాతం పోలింగ్ నమోదు


హర్యానాలో బుధవారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. దీంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 76 శాతం పోలింగ్ నమోదైంది. 1967లో ఆ రాష్ట్రంలో 72.65 శాతం పోలింగ్ నమోదు కాగా, దాదాపు 45 ఏళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినా, రాష్ట్రంలోని మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఫతేహబాద్, హిసార్, జింద్, కురుక్షేత్ర, మేవాట్, రోహ్ తక్, సిర్సా, యమునా నగర్, కైథాల్ తదితర నియోకవర్గాల్లో భారీ పోలింగ్ నమోదైంది. మరోవైపు ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, ఐఎన్ఎల్ డీ నేతలు అభయ్ చౌతాలా, దుష్యంత్ చౌతాలా, హెచ్ జేసీ నేత కుల్దీప్ బిష్ణోయ్ నియోజకవర్గాల్లోనూ భారీ పోలింగ్ నమోదైంది. ఇక మహారాష్ట్రలోనూ 64 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

  • Loading...

More Telugu News