: 'రేడియో అక్కయ్య' ఇక లేరు!
'రేడియో అక్కయ్య'గా దశాబ్దాలుగా చిన్నారులను అలరించిన ప్రముఖ రచయిత్రి తురగా జానకిరాణి హైదరాబాదు, పంజాగుట్టలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. మచిలీపట్నం సమీపంలోని మందపాకల గ్రామంలో ఆమె జన్మించారు. రచయిత్రిగా ఆమె మూడు కథా సంకలనాలు, రెండు నవలలు, రేడియో నాటకాల సంకలనం, 'చేతకాని నటి' కవితా సంకలనం, 'మా తాతయ్య చలం' లేఖా సాహిత్యం, అయిదు అనువాద గ్రంధాలు, 35 పిల్లల పుస్తకాలు, అనేక వ్యాసాలు మరికొన్ని ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆమె నాలుగు సార్లు ఆకాశవాణి జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఇంకా మరెన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.