: 5 నిమిషాల్లో 100 పుష్ అప్స్ తీసిన బామ్మగారు


అవును, ఈ బామ్మగారు మామూలు బామ్మ కాదు. అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న బామ్మ. వృద్ధాప్యంలో కూడా తన మజిల్ పవర్ చూపిస్తోంది. 81 ఏళ్ల లీ గుశాన్ అనే ఈ చైనా మహిళ కేవలం 5 నిమిషాల్లో 100 పుష్ అప్స్ తీసి రికార్డు సృష్టించింది. లీ గుశాన్ ఇప్పటికీ బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తూ తనకు ఇంకా వృద్ధాప్యం రాలేదని నిరూపిస్తోంది. పుష్ అప్స్, సిట్ అప్స్ ప్రాక్టీస్ చేసే లీ గుశాన్, రోలీ పోలీ రోల్ అనే కొత్త ఎక్సర్ సైజ్ ను కూడా రూపొందించింది. ప్రతిరోజూ ఆమె ఈ కొత్త ఎక్సర్ సైజ్ ను వంద సార్లు ప్రాక్టీస్ చేస్తోంది. వ్యాయామం ద్వారా కండరాలు, ఎముకలు పటిష్టమవుతాయని ఆమె సూచిస్తోంది. వ్యాయామం చేయడమే కాదండోయ్, చిట్కాలు కూడా చెబుతూ స్పూర్తిగా నిలుస్తోందీ బామ్మ.

  • Loading...

More Telugu News