: మహారాష్ట్ర, హర్యానాల్లో పోలింగ్ ముగిసింది
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మహారాష్ట్రలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా, హర్యానాలో 73 శాతం ఓటింగ్ జరిగింది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం ప్రకటించింది.