: కించపరిచే వ్యాఖ్యలను సహించబోం: ఉద్ధవ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు


‘ఛాయ్ వాలా పీఎం అవగా లేనిది, నేను సీఎం కాలేనా’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం. అయితే మాపై దూషణలకు దిగే వారిని మాత్రం వదలబోం. తగిన గుణపాఠం చెబుతాం’ అంటూ ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం చెప్పారు. ఓ వైపు మహారాష్ట్రలో పోలింగ్ కొనసాగుతుండగానే ఈ విషయంపై వివాదం చెలరేగింది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ‘25 ఏళ్లుగా శివసేనతో కలిసి పోటీ చేశాం. విజయాన్ని చూశాం. ఓటమిని ఎదుర్కొన్నాం. అయితే స్నేహం విడిపోయిన వెంటనే మోడీపై థాకరే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సబబు కాదు’ అని ఆయన శివసేనకు కాస్త ఘాటుగానే బదులిచ్చారు.

  • Loading...

More Telugu News