: విజయనగరం చేరుకున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం చేరుకున్నారు. అక్కడి తిప్పవలస, కోనాడ ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తుపాను నేపథ్యంలో అక్కడి ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఇంకా వారికి కావల్సిన నిత్యావసరాలను, సాయాన్ని ప్రభుత్వం నుంచి బాధితులకు అందజేసేవిధంగా చర్యలు తీసుకుంటారు. అటు జరిగిన నష్టాన్ని అధికారులతో కలసి చంద్రబాబు పరిశీలిస్తారు.