: బిడియం... మహిళలను అల్జీమర్స్ బారిన పడేస్తుందట!
బిడియానికి కేరాఫ్ అడ్రెస్ మహిళ. అదే వారికి వెలకట్టలేని ఆభరణమని పెద్దలు చెప్పిన మాటలూ విన్నాం. కానీ, స్వీడన్ శాస్త్రవేత్తలు చెప్పే మాటలు వింటే మాత్రం ఒళ్లు జలదరించక మానదు. ఎంటుకంటే, మహిళలకు వెలకట్టలేని ఆభరణమైన బిడియం, వారిని అల్జీమర్స్ (మతిమరపు) వ్యాధి బారిన పడేస్తుందట. సాధారణ స్థాయి బిడియం ఉండే మహిళల కంటే సదరు లక్షణం పాళ్లు కాస్త ఎక్కువగా ఉండే మహిళలు, సున్నిత మనస్కుల విషయంలో ఈ ముప్పు మరింత ఎక్కువట. ఇక నిత్యం ఆందోళనకు గురవుతున్న మహిళలూ ఈ వ్యాధి బారిన పడటం ఖాయమని కూడా వారు పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు. స్వీడన్ లోని గొతెన్ బర్గ్ వర్సిటీకి చెందిన లెనా జాన్సన్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం ఒత్తిడికి గురయ్యే మహిళలతో పాటు బిడియం పాళ్లు ఎక్కువగా ఉండే మహిళలు అల్జీమర్స్ బారిన పడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని ఆయన వెల్లడించారు.