: డిపార్ట్ మెంట్ పరువు తీసిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన ఎస్పీ


ఒకరినొకరు నానా తిట్లు తిట్టుకుంటూ, కొట్టుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను గుంటూరు జిల్లా ఎస్పీ రామకృష్ణ సస్పెండ్ చేశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ పరువు పోయేలా ప్రవర్తించారన్న కారణంతో వారిద్దరిపై చర్య తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ లో శ్రీదేవి కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆమె భర్త వెస్లీ పట్టాభిపురం పీఎస్ లో పనిచేస్తున్న విజయలక్ష్మి అనే మరో మహిళా కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నిన్న విజయలక్ష్మి ఇంటికి కొంతమందితో కలసి శ్రీదేవి వెళ్లింది. ఆ సమయంలో విజయలక్ష్మి, వెస్లీ ఇద్దరూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో, శ్రీదేవి, విజయలక్ష్మిల మధ్య పెద్ద గొడవ జరిగింది. తిట్ల పురాణాలు అందుకున్నారు, సిగపట్లు పట్టారు. విజయలక్ష్మిని శ్రీదేవి చితకబాదింది. భర్త వెస్లీకి చెప్పు దెబ్బలు తప్పలేదు. ఈ ఘటనలో విజయలక్ష్మి గాయాలపాలయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో వీరిద్దరినీ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. శ్రీదేవి భర్త వెస్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News