: వెల్లువెత్తుతున్న 'సినీ' విరాళాలు... రామానాయుడు రూ. 50 లక్షలు... సూర్య కుటుంబం రూ. 50 లక్షలు
హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు, తమిళ సినీనటులు పెద్దమనసుతో ముందుకొస్తున్నారు. కేవలం వినోదాన్ని పంచడానికే కాకుండా... అవసరమైనప్పుడు ఆపన్నహస్తం అందించడానికి కూడా తామంతా సిద్దమే అని చాటుతున్నారు. ఈ క్రమంలో పలువురు సినీనటులు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. వారి వివరాలు... * రామానాయుడు రూ. 50 లక్షలు * తమిళ హీరో సూర్య కుటుంబం రూ. 50 లక్షలు * తమిళ హీరో విశాల్ రూ. 15 లక్షలు * హీరో రవితేజ రూ. 10 లక్షలు * హీరో రామ్ రూ. 10 లక్షలు * నటుడు ప్రకాశ్ రాజ్ రూ. 5 లక్షలు * హీరో అల్లరి నరేష్ రూ. 5 లక్షలు * హాస్యనటుడు బ్రహ్మానందం రూ. 3 లక్షలు * హీరో సందీప్ కిషన్ రూ. 2.5 లక్షలు * హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రూ. లక్ష.