: టీ కొట్టు యజమాని ప్రధాని అయినప్పుడు... నేను సీఎం కాలేనా?: ఉద్ధవ్ థాకరే


శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్నికల రోజున కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘టీ కొట్టు నడిపిన వ్యక్తి ప్రధాని అయినప్పుడు, తాను ముఖ్యమంత్రిని కాలేనా?’’అంటూ ప్రశ్నించారు. శివసేన సొంత పత్రిక సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాటి సామ్నా సంచికలో ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైంది. 25 ఏళ్లుగా బీజేపీతో కలిసి పనిచేశామని, అయితే బీజేపీ వ్యవహార సరళితో ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెప్పారు. అయితే గెలుపు మాత్రం తమదేనని ధాకరే ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News