: వరంగల్ జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన
వ్యవసాయానికి కనీసం 7 గంటలపాటైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి రైతులు రోడ్డెక్కారు. మహబూబాబాద్-వరంగల్ రహదారిపై దాదాపు 150 మంది రైతులు బైఠాయించి ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అలసత్వం కారణంగా చేతికొచ్చిన పంటను కోల్పోయే పరిస్థితులు దాపురించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.