: ఎబోలాపై మేల్కొనకపోతే... వారానికి 10 వేల కొత్త కేసులు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రాణాంతక వ్యాధి ఎబోలాను అరికట్టే చర్యలను తక్షణమే చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. లేనిపక్షంలో పెనుముప్పు సంభవించే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా శరవేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్న ఆ సంస్థ, రెండు నెలల్లో వారానికి 10 వేల మంది చొప్పున ఈ వ్యాధి బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. నాలుగు వారాలుగా వారానికి వెయ్యి మంది చొప్పున ఈ వ్యాధిబారిన పడుతున్నారని, ఇదే రీతిన ఎబోలా వ్యాప్తి జరిగితే, రానున్న 60 రోజుల్లోనే ఈ వ్యాధి వ్యాప్తి జెట్ స్పీడును అందుకుంటుందని వెల్లడించింది.