: కాశ్మీర్ లో 'ఇసిస్' జెండా ప్రదర్శన కొందరు మూర్ఖుల పనే: ఒమర్ అబ్దుల్లా


జమ్మూ, కాశ్మీర్లో ఇసిస్ తీవ్రవాద సంస్థ ప్రభావం ఎంతమాత్రం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అయితే కొందరు మూర్ఖుల కారణంగా కాశ్మీర్ లోయలో ఇసిస్ జెండా కనిపించిందని ఆయన వెల్లడించారు. సదరు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఆ జెండాను కుట్టిన టైలర్ నూ గుర్తించామని ఆయన చెప్పారు. సదరు దర్జీపై కఠిన చర్యలు తీసుకుంటామని అబ్దుల్లా చెప్పారు. కొందరు మూర్ఖులు ఇసిస్ జెండాను ప్రదర్శిస్తుండగా, దురదృష్టవశాత్తు మీడియా కంటబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ ఒక్క ఘటనతోనే రాష్ట్రంలో ఇసిస్ ఉందని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇసిస్ తరహా సంస్థలను కాలుమోపనీయబోమని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News