: ఉత్తరాంధ్ర దుస్థితికి చలించిన ప్రభాస్... 20 లక్షల విరాళం
హుదూద్ తుపాను ధాటికి చిగురుటాకులా వణికిన ఉత్తరాంధ్ర ప్రజల దుస్థితి చూసి చలించిన సినీ నటుడు ప్రభాస్ 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఆయన ముఖ్యమంత్రి సహాయనిధికి 20 లక్షల రూపాయలను పంపించనున్నారు. సినీ నటులు పెద్ద మనసుతో స్పందించడం వారి అభిమానులను హర్షాతిరేకంలో ముంచుతోంది.