: 4.2 సెకెన్లలో లక్ష ఫోన్లు కొనేశారు
మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చైనా కంపెనీ జియోమీకి సంబంధించిన 'రెడ్ మీ 1ఎస్' మోడల్ మొబైల్ ఫోన్ ను 4.2 సెకన్లలోనే లక్ష పీస్ లను అమ్మేసినట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ 720పీ రెజల్యూషన్ తో 4.7 అంగుళాల స్క్రీన్ తో 1జీబీ ర్యామ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. అలాగే, దీనిలో 8జీబీ ఇంటర్నల్ స్టోరెజ్ అందుబాటులో ఉండగా, అదనపు మెమరీ కోసం మెక్రో ఎస్ డీ కార్డును కూడా వినియోగించుకోవచ్చు. అలాగే ఇది డ్యుయల్ సిమ్ ను సపోర్ట్ చేస్తుంది. దీనిని ముందుగా రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ అమ్మకాలు ప్రారంభించింది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు అమ్మకాలు ప్రారంభించగా మరో 4.5 సెకన్ల తరువాత 'నో స్టాక్' అంటూ ప్రకటించారు. నేటి అమ్మకాల్లో 4.2 సెకన్లలో లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయని, జియోమీ రెడ్ మీ 1ఎస్ కోనుగొలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న భారతీయ వినియోగదారులకు ధన్యవాదాలు అంటూ జియోమీ కంపెనీ భారత విభాగం ప్రతినిధి తెలిపారు.