: శివసేన సపోర్ట్ లేనిదే మోడీ తండ్రి కూడా గెలవలేరు: ఉద్ధవ్ థాకరే
బీజేపీతో ఇరవై ఐదేళ్ల మిత్రబంధాన్ని తెగతెంపులు చేసుకున్న శివసేన పార్టీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీపై తీవ్ర మాటల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మరో ముందడుగు వేసిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీపై వ్యక్తిగత దాడికి దిగారు. ప్రస్తుత ఆరోపణల్లోకి మోడీ తండ్రిని కూడా లాగారు. "మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో మోడీ సొంతంగా గెలవలేదు. ఆయన ప్రధానమంత్రి అయ్యాక మహారాష్ట్ర పార్టీ (శివసేన)ని ఏ విధంగానూ గుర్తించలేదు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచి క్యాబినెట్ ఏర్పాటు చేసే సమయంలోనే దాన్ని ఆయన సూచించారు" అని పార్టీ పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో పేర్కొన్నారు. తమ పార్టీ మద్దతు పొడిగించకపోతే మోడీయే కాదు, ఆయన తండ్రి దామోదర్ దాస్ కూడా మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయేవారు" అని పేర్కొన్నారు.