: భారతీయ పోలీస్ ఇన్ స్పెక్టర్ కు ఐరాస 'పీస్ కీపర్ అవార్డు'
ప్రతిష్ఠాత్మక 'అంతర్జాతీయ ఫిమేల్ పీస్ కీపర్-2014' అవార్డును జమ్మూకాశ్మీర్ కు చెందిన శక్తిదేవీ అనే పోలీస్ ఇన్ స్పెక్టర్ పొందారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి పోలీస్ విభాగం ఆమెకు పురస్కారాన్ని అందజేసింది. ఐరాస కార్యక్రమ విధుల్లో భాగంగా ఆమె సాధించిన అసాధారణ విజయాలకు గానూ ఈ అవార్డు దక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ లో దేవి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో లైంగికంగా, లింగ వివక్షతో హింసకు గురైన బాధితులకు ఆమె అనూహ్యమైన సాయం చేసినట్లు యూఎన్ పోలీస్ విభాగం పేర్కొంది. ఈ నేపథ్యంలో అఫ్ఘనిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో మహిళా పోలీస్ కౌన్సిల్స్ ఏర్పాటు చేేసే విధంగా పురికొల్పినట్లు తెలిపింది.