: 'ఎబొలా' వార్తలో ప్రకాశ్ రాజ్ ఫొటో పెట్టారు!


పొరబాట్లు మానవ సహజం. యాహూ.కామ్ వెబ్ సైట్లోనూ ఓ పొరబాటు చోటుచేసుకుంది. ఈ వెబ్ సైట్ వివిధ న్యూస్ సైట్ల నుంచి వార్తలను ఆర్ఎస్ఎస్ ఫీడింగ్ రూపంలో తీసుకుంటుంది. అలా ఇండియన్ ఎక్స్ ప్రెస్ నుంచి తీసుకున్న ఓ వార్తలో నటుడు ప్రకాశ్ రాజ్ ఫొటోను పెట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికా హెల్త్ వర్కర్ కు ఎబొలా సోకిందన్నదే ఆ వార్త. తొలుత ఆ వార్త చూసిన వారెవరైనా, ఎబొలాకు ప్రకాశ్ రాజ్ కు ఏమిటి సంబంధం? అనుకోకమానరు. ఆ వార్తను ఓపెన్ చేస్తే ప్రకాశ్ రాజ్ కు సంబంధించిన ఏ ఒక్క అంశమూ అందులో కనిపించలేదట. దీంతో, నాలిక్కరుచుకున్న యాహూ వెంటనే ఆ వార్తను తొలగించింది.

  • Loading...

More Telugu News