: సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు, రామకృష్ణ మిషన్ కు రూ. 5 లక్షలు: హీరో రాంచరణ్


హుదూద్ తుపాను వల్ల అతలాకుతలమైన సుందర విశాఖను చూస్తుంటే చాలా బాధేస్తోందని సినీ హీరో రాంచరణ్ అన్నారు. హుదూద్ తుపాను చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న తన అభిమానులతో మాట్లాడదామన్నా మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదని తెలిపారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని తన అభిమానులకు మీడియా ద్వారా పిలుపునిస్తున్నానని చెప్పారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు, రామకృష్ణ మిషన్ కు రూ. 5 లక్షలు విరాళంగా అందజేస్తున్నానని చరణ్ ప్రకటించారు. తుపాను నష్ట తీవ్రతను నివారించడంలో, సహాయక కార్యక్రమాలను చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేశాయని కితాబిచ్చారు. ముందస్తు హెచ్చరికలతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని చరణ్ చెప్పారు. అపోలో హాస్పిటల్స్ కు చెందిన ఫార్మా ఔట్ లెట్ల ద్వారా క్లోరినేషన్, బ్లీచింగ్ సరఫరా చేస్తామని చెప్పారు. తుపాను బాధితులకు మందులు, పాలపొడి, బిస్కెట్లు, ఆహారం అందజేస్తామని వెల్లడించారు. ఒక జిల్లాను దత్తత తీసుకుంటానని తెలిపారు.

  • Loading...

More Telugu News