: అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై మండిపడ్డారు. తుపాను బాధిత ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సహాయక చర్యల విషయంలో కొంతమంది అధికారులను మందలించారు. చెప్పిన సమయానికి అధికారులు రాకపోతే వారి ఇళ్ళకు పోలీసులను పంపిస్తానన్నారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలో అవగాహన లేకుంటే ఎలా అని అడిగారు. పెట్రోల్, డీజిల్ ను తక్షణమే సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. మంచినీటి సరఫరా ఎందాకా వచ్చిందని ప్రశ్నించిన సీఎం... ఆహారం, మంచినీళ్ల విషయంలో ప్రజలకు కష్టం కలగకుండా చూడాలని చెప్పారు.