: తప్పుడు మాటలొద్దు: టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుత్తా వార్నింగ్
గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే తెలంగాణలో విద్యుత్ సమస్య తలెత్తిందని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తప్పుడు మాటలు మాట్లడటం మానేయాలని... లెక్కలు తీసి చూసుకోవాలని హితవు పలికారు. సర్వేలు, దరఖాస్తులంటూ ప్రజలను మోసం చేయడం ఆపేయాలని ప్రభుత్వానికి సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా టీటీడీపీ నేతలకు కూడా ఆయన చురక అంటించారు. బస్సు యాత్రలు ఆపి, చంద్రబాబును ఒప్పించి ఏపీ నుంచి విద్యుత్ ను తెప్పించాలని ఎద్దేవా చేశారు.