: ప్రజలు సహకరించాలి: విశాఖ పెట్రోల్ బంక్ యజమానులు
విశాఖలోని పెట్రోల్ బంకుల్లో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనపడుతున్నాయి. మరికొన్ని చోట్ల వందలాది వాహనాలు క్యూలో నిలబడ్డాయి. ఈ నేపథ్యంలో, పెట్రోల్ బంకు యజమానులపై విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై విశాఖ పెట్రోలు బంకుల యజమానులు స్పందించారు. కొన్ని బంకుల్లోని ట్యాంకుల్లో నీరు నిలిచిందని... ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. సాయంత్రంలోపు అన్ని బంకుల్లో పెట్రోలు, డీజిల్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలెవరూ బ్లాక్ మార్కెట్లో పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేయరాదని విన్నవించారు.