: ఫ్రాన్స్ ఎకానమిస్ట్ కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి


ఈ ఏడాది ఫ్రాన్స్ దేశస్థులు రెండు నోబెల్ బహుమతులను దక్కించుకున్నారు. సాహిత్యంలో ఇప్పటికే ఫ్రెంచ్ సాహితీవేత్త పాట్రిక్ మొడియానోను నోబెల్ వరించగా, తాజాగా అదే దేశానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ టిరోల్ నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. మార్కెట్ శక్తి, నియంత్రణలపై సాగించిన పరిశోధనలకు గానూ టిరోల్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం రాయల్ స్వీడిష్ అకాడెమీ ఓ ప్రకటనను జారీ చేసింది. కంపెనీల గుత్తాధిపత్యాన్ని అడ్డుకునే విధానాలపై టిరోల్ సాగించిన పరిశోధనలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. నోబెల్ బహుమతి కింద టిరోల్ కు రూ.6.8 కోట్లు లభించనున్నాయి.

  • Loading...

More Telugu News