: ఆరు లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు
కనీవినీ ఎరుగని రీతిలో హుదూద్ తుపాను విరుచుకుపడడంతో విశాఖలోని లోతట్టు ప్రాంత వాసులను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు. అలా ఆరు లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. వారందరికీ బియ్యం, పంచదార, పాలు పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వైమానిక విభాగానికి చెందిన ప్రత్యేక విమానాల్లో ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నామని, 20 లక్షల క్లోరిన్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో కేజీహెచ్ ఆసుపత్రి పూర్తి స్థాయిలో పని చేస్తుందని ఆయన వివరించారు.