: హీరో గోపీచంద్ తండ్రయ్యాడు


టాలీవుడ్ కథానాయకుడు గోపీచంద్ తండ్రయ్యాడు. ఆయన భార్య రేష్మ ఈ మధ్యాహ్నం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చాలా ఆనందంతో గోపీచందే ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దేవుడు తనను మగబిడ్డతో ఆశీర్వదించాడన్న గోపీ... తనకు దీవెనలు అందించిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాడు. తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని గోపీచంద్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అప్పుడే తనకు మగబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నానని, ఎందుకంటే చిన్నతనంలోనే చనిపోయిన తన తండ్రి తిరిగి మళ్లీ తనకు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అనుకున్నట్టుగానే బేబీ బాయ్ జన్మించడంతో సంతోషంలో మునిగిపోయాడు.

  • Loading...

More Telugu News