: కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా శశి థరూర్ తొలగింపు
తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ను అధికార ప్రతినిధి పదవి నుంచి కాంగ్రెస్ తొలగించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని అదే పనిగా ప్రశంసిస్తూ పార్టీకి ఆయన నష్టం కలిగించారంటూ కేరళ కాంగ్రెస్ నేతలు గత వారంలో అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పైవిధంగా చర్యలు తీసుకున్నారు. పలు విషయాల్లో మోడీని తెగ పొగిడిన థరూర్... 'స్వచ్ఛ భారత్ అభియాన్'లో పాల్గొనాలన్న మోడీ ఆహ్వానాన్ని అంగీకరించారు. దాంతో, కేరళ కాంగ్రెస్ నేతలు ఆయనను విమర్శించారు కూడా.