: గిరిజను రక్షించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు
రంగారెడ్డి జిల్లా మంచాలలో బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలిక గిరిజను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 11 గంటలకు సహాయక చర్యలను ప్రారంభించారు. 45 అడుగుల లోతులో గిరిజ ఉన్నట్టు ఎన్డీఆరెఫ్ సిబ్బంది గుర్తించారు. దీంతో 4 జేసీబీలతో 40 అడుగుల మేర తవ్వకాలు జరిపారు. అయితే, 40 అడుగుల వద్ద నీరు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మరో 10 అడుగులు తవ్వకాలు జరుపుతామని అధికారులు తెలిపారు.