: తెలంగాణకు మరిన్ని కరెంటు కష్టాలు
ఇప్పటికే కరెంటు లోటుతో సతమతమవుతున్న తెలంగాణకు కరెంటు కష్టాలు మరింత పెరిగాయి. విశాఖపై విరుచుకుపడిన హుదూద్ తుపానే దీనికి కారణం. తుపాను తీవ్రతతో విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంటులో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో, తెలంగాణకు సరఫరా కావాల్సిన 1100 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని... నాగార్జునసాగర్ లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం.