: చంద్రబాబుకు ఫోన్ చేసిన రాజ్ నాథ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. తుపాను పరిస్థితి గురించి చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధమని హామీ ఇచ్చారు. రాజమండ్రిలో మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో... రాజ్ నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన అనంతరం, మీడియాతో సమావేశాన్ని చంద్రబాబు కొనసాగించారు.