: దారుణంగా దెబ్బతిన్న విశాఖ ఎయిర్ పోర్ట్


హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సానికి విశాఖ విమానాశ్రయం దారుణంగా దెబ్బతింది. తీవ్ర గాలులకు ఎయిర్ పోర్ట్ పైకప్పులు ఎగిరిపోయాయి. అన్ని కార్యాలయాలతో పాటు లాంజ్ కూడా 50 శాతానికి పైగా దెబ్బతింది. అద్దాలు పగిలిపోయాయి. విమానాలు టేకాఫ్, ల్యాండ్ అయ్యే రన్ వే పూర్తిగా నీట మునిగింది. కొన్ని చోట్ల కోతకు కూడా గురయిందని తెలుస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల వరకు విమాన రాకపోకలకు అవకాశం లేదని అధికారులు ప్రకటించారు. రెండు రోజుల తర్వాత గానీ, ఎయిర్ పోర్టుకు జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేయలేమని తెలిపారు.

  • Loading...

More Telugu News