: దెబ్బతిన్న పంటలకు సబ్సిడీ పెంపు: మంత్రి ప్రత్తిపాటి
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ పెంచుతామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వరి, పత్తి, వేరుసెనగ, ఇతర పంటలకు రూ.6 వేలు సబ్సిడీగా అందిస్తున్నామని, ఈ సబ్సిడీని రూ.1000 నుంచి రూ.2000 వరకు పెంచుతామని చెప్పారు. సబ్సిడీ పెంపుపై రేపు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.