: హుదూద్ కారణంగా తెలంగాణలోనూ భారీ వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను కారణంగా ఆదివారం రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఆ కేంద్రం వెల్లడించింది. మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.