: శ్రీకాకుళంలో ఏడుగురి ప్రాణాలను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్


శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల పరిధిలోని ఓ లంక గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించాయి. 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నప్పటికీ వెరవని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అత్యంత ధైర్య సాహసాలతో ముందుకెళ్లి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కొందరు వ్యక్తులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, వరద నీటిలో చిక్కుకుని బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్న బాధితుల ప్రాణాలను కాపాడింది.

  • Loading...

More Telugu News