: నార్వే, ఫిన్లాండ్ దేశాల పర్యటనకు బయల్దేరిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నార్వే, ఫిన్లాండ్ దేశాల పర్యటనకు గాను ఆదివారం ఉదయం పయనమయ్యారు. ఈ రెండు దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకునే దిశగా రాష్ట్రపతి పర్యటన సాగనుంది. ముఖ్యంగా నార్వే నుంచి మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను రాబట్టేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకోవాలని భారత్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే, రాష్ట్రపతి ప్రణబ్ తో పాటు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ కూడా పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద హమీద్ అన్సారి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, త్రివిధ దళాల అధిపతులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.