: ఒడిశాలో ఇద్దరిని పొట్టనబెట్టుకున్న హుదూద్
పంజా విసిరిన గంటల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురిని బలి తీసుకున్న హుదూద్ తుపాను కారణంగా ఒడిశాలోనూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఈ తుపాను కారణంగా ఆదివారం మధ్యాహ్నం నాటికి చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. పూరి సమీపంలోని తీర ప్రాంతంలో బోటును ఒడ్డుకు చేర్చే క్రమంలో ఓ మత్స్యకారుడు సముద్ర అలల్లో కొట్టుకుపోయాడు. తుపాను నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో శనివారం ఓ బాలిక నీట మునిగి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తుపాను కారణంగా ఒడిశాలో ఇప్పటిదాకా 68 వేల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.