: బీజేపీ, కాంగ్రెస్... రెండూ నన్ను టార్గెట్ చేశాయి: చౌతాలా


హర్యానా మాజీ సీఎం, టీచర్ల కుంభకోణంలో పదేళ్ల జైలు శిక్షకు గురైన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా శనివారం తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలో పదేళ్ల పాటు పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పైనా విరుచుకుపడ్డారు. కేవలం అధికార కాంక్షతోనే బీజేపీ, కాంగ్రెస్ లు తనను లక్ష్యంగా చేసుకుని సీబీఐని తనపైకి ఉసిగొల్పాయని ఆయన ఆరోపించారు. ఈ నెల 15న జరగనున్న ఎన్నికల్లో తన విజయం ఖాయమని భావించినందునే ఆ రెండు పార్టీలు తన బెయిల్ రద్దయ్యేలా వ్యవహరించాయన్నారు. ప్రధాని మోడీ నిర్వహించిన బహిరంగ సభలకు జనం పలుచగా కనిపించిన నేపథ్యంలోనే కేంద్రం సీబీఐని తనపైకి ఉసిగొల్పిందని చౌతాలా వ్యాఖ్యానించారు. తాను జైలులో ఉన్నా, విజయం మాత్రం ఐఎన్ఎల్డీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, నరేంద్ర మోడీ హోదాను దిగజారుస్తున్నారని చౌతాలా విరుచుకుపడ్దారు.

  • Loading...

More Telugu News