: సాయంత్రం నుంచి డైరెక్ట్ గా సహాయక చర్యల్లో పాల్గొంటా: చంద్రబాబు
తుపాను నేపథ్యంలో, ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ తయారు చేసిందని... తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని సమాచారం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని చెప్పారు. మరో 3, 4 గంటల వరకు తుపాను తీవ్రత కొనసాగుతుందని తెలిపారు. తుపానుపై సెక్రటేరియట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తాను హైదరాబాదులోనే ఉండి... టెక్నాలజీ సహాయంతో తుపానును సమీక్షించానని చంద్రబాబు చెప్పారు. ఇక నుంచి సీఎస్ హైదరాబాదులో ఉండి పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపారు. సాయంత్రం తాను వైజాగ్ వెళుతున్నానని... ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొంటానని తెలిపారు. తీర ప్రాంతంలో మొబైల్ సేవలు స్తంభించాయని... దీనిపై టెలికాం ఆపరేటర్లందరితో మాట్లాడానని... త్వరితగతిన వారు మొబైల్ సేవలను పునరుద్ధరిస్తారని చెప్పారు.