: చంద్రబాబు మీడియాతో మాట్లాడుతుండగా ఫోన్ చేసిన మోడీ
హైదరాబాదులో హుదూద్ తుపానుపై మీడియాతో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో, ప్రసంగాన్ని ఆపి... మోడీతో మాట్లాడారు చంద్రబాబు. విశాఖ హెచ్చరికల కేంద్రానికి రాడార్ తో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా మోడీకి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోడీకి క్లుప్తంగా వివరించారు. సహాయక చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం తాను వైజాగ్ వెళుతున్నానని చెప్పారు. మోడీతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, తానే మోడీకి ఫోన్ చేద్దామనుకున్నానని... ఇంతలో ఆయనే ఫోన్ చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని మోడీ అన్నారని... కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారని తెలిపారు.