: విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రానికి, రాడార్ తో సంబంధాలు తెగిపోయాయ్
తుపాను గురించి హెచ్చరికలు అందించే విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రమే మూగబోయింది. హుదూద్ తుపాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షంతో హెచ్చరికల కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. భీకర గాలులకు భవనంలోని కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. దీంతో, తుపాను హెచ్చరికల కేంద్రానికి రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి.