: 320 గ్రామాలపై తుపాను ప్రభావం: సీఎంవో


మొత్తం 44 మండలాలు, 320 గ్రామాలపై హుదూద్ తుపాను ప్రభావం ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇప్పటి వరకు 90,013 మందిని సురక్షిత ప్రాంతాలను తరలించినట్టు వెల్లడించింది. 19 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయని తెలిపింది. 4 జిల్లాల పరిధిలో 223 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రకటించింది. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News