: భీమిలి వద్ద తీరాన్ని తాకిన హుదూద్ తుపాను
హుదూద్ తుపాను విశాఖ పరిధిలోని భీమిలి-కైలాసగిరి మధ్య తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటలకు ఇది తీరాన్ని దాటుతుంది. ప్రస్తుతం ఇది విశాఖకు 24 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీర ప్రాంతంలో 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరాన్ని దాటే సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీసే అవకాశం ఉంది.