: విజయవంతమైన పీఎస్ఎల్వీ సీ-26 సన్నద్ధత ప్రయోగం
శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రంలో ఈ ఉదయం నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ-26 వాహకనౌకకు సంబంధించిన సన్నద్ధత ప్రయోగం విజయవంతం అయింది. ప్రయోగం సమయంలో నిర్వహించే పనులన్నింటినీ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు టెస్ట్ చేశారు. సన్నద్ధత ప్రయోగం విజయవంతం కావడంతో... ప్రయోగానికి ముందు జరిగే మిషన్ రెడీనెస్ సమీక్ష, లాంఛ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశాలు ఈ రోజు జరగనున్నాయి. అక్టోబరు 16న పీఎస్ఎల్వీ సీ-26ను నింగిలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఇస్రోలోని అన్ని విభాగాల శాస్త్రవేత్తలు, ప్రాజెక్టు డైరెక్టర్లు షార్ కు చేరుకున్నారు.