: రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ
హుదూద్ తుపాను ప్రళయం నుంచి ప్రజలను కాపాడేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగాయి. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలను చేపట్టేందుకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను సిద్ధం చేసింది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు 4 ఇంజినీర్ టాస్క్ ఫోర్స్ టీములు, 8 రెస్క్యూ టీములను ఇండియన్ ఆర్మీ పంపింది.