: భవ్యశ్రీ హైదరాబాద్ చేరుకుందా?... లేదా?


హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న భవ్యశ్రీ రెండు రోజుల క్రితం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు భవ్యశ్రీ కోసం విస్తృత గాలింపు చేపట్టిన సంగతీ తెలిసిందే. అయితే, భవ్యశ్రీ ఆచూకీపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు... భవ్యశ్రీతో పాటు మరో వ్యక్తిని కూడా సైబరాబాద్ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారని... భవ్యశ్రీని హైదరాబాద్ తీసుకువచ్చారని సమాచారం అందుతోంది. మరోవైపు... భవ్యశ్రీ ఆచూకీ ఇంతవరకు లభించలేదని, ఆమె కోసం ప్రత్యేక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని కూకట్ పల్లి సీఐ మీడియాతో చెబుతున్నారు. దీంతో, భవ్యశ్రీ హైదరాబాద్ చేరుకుందా? లేదా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.

  • Loading...

More Telugu News