: గొప్ప ఆలోచనలతో ముందుకు సాగండి...లక్ష్యాలు సాకారం చేసుకోండి: కలాం


గొప్పగా ఆలోచిస్తూ వాటిని సాకారం చేసుకునేందుకు ముందుకు సాగాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించారు. హైదరాబాదులోని ఓ స్కూలును సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నోబెల్ బహుమతి సాధించిన కైలాష్ సత్యార్థి భారతీయుల్లో స్పూర్తిని రగిలించారని అన్నారు. నోబెల్ బహుమతి వంటి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రత్యేక స్థానం సంపాదించాలని ఆయని పిలుపునిచ్చారు. తగిన జ్ఞానం సముపార్జించుకుని నిత్యం కష్టపడే తత్వం, సమయస్ఫూర్తితో పని చేస్తే అనుకున్న లక్ష్యం సాధించుకోవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News