: ఎన్నుకున్నదీ వారే... తొలగించిందీ వారే!
రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షపదవి నుంచి లలిత్ మోడీని తొలగించారు. మోడీకి వ్యతిరేకంగా 23 జిల్లాల అధ్యక్షులు ఓటు వేశారు. దీంతో అతడ్ని పదవి నుంచి తప్పించారు. అతని స్థానంలో తాత్కాలిక అధ్యక్షునిగా అమిత్ పఠాన్ నియమితులయ్యారు. ఏప్రిల్ 30న జరిగిన రాజస్థాన్ క్రికెట్ ఎన్నికల్లో 33 ఓట్లకు గాను 24 ఓట్లు సాధించిన లలిత్ మోడీని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రకటించారు. దీంతో ఆఘమేఘాలమీద స్పందించిన బీసీసీఐ అండర్ రూల్ 32(7) ప్రకారం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ను సస్పెండ్ చేశారు. దీంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మల్లగుల్లాలు పడి లలిత్ మోడీని అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. బీసీసీఐ ఇప్పుడేమంటుందో మరి.